ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 29, 2020, 2:44 PM IST

ETV Bharat / city

రక్తపోటు అదుపునకు ముందస్తు జాగ్రత్తలు

రక్తపోటును నియంత్రించేందుకు.. ‘ఇండియా హైపర్‌ టెన్షన్‌ కంట్రోల్‌ ఇనీషియేటివ్‌’ (ఐహెచ్‌సీఐ)' పేరుతో పైలెట్ ప్రాజెక్ట్​ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు.

Hyper Tension Control Project Launch in krishna collector
ఇండియా హైపర్ కంట్రోల్ ఇన్ యాక్టివ్ బ్రోచర్ విడుదల

ప్రజల్లో రక్త పోటును (బీపీ) అదుపు చేసే దిశగా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ‘ఇండియా హైపర్‌ టెన్షన్‌ కంట్రోల్‌ ఇనీషియేటివ్‌’ (ఐహెచ్‌సీఐ) కార్యక్రమం అమలు కోసం కృష్ణా, విశాఖ జిల్లాలను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ప్రజల్లో రక్తపోటును గుర్తించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు.

రక్తపోటును తెలుసుకునేందుకు ఆధునిక పరికరాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. రోగి వివరాలు నమోదు చేసి అతనికి ఉన్న ఆరోగ్య స్థితి ఆధారంగా మూడంచెల విధానంలో ఔషదాలు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అలాగే.. కుష్టు నిర్మూలనకు చర్యలు చేపడుతున్నామని.. అక్టోబరు 1 నుంచి కుష్ఠు నియంత్రణపై ప్రచారం చేయనున్నామని ఇంతియాజ్ తెలిపారు. ఈ 2 కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్స్ ను విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details