కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రానున్న ఐదు రోజుల్లో వడగాలులు వీస్తాయని విశాఖ వాతవరణ శాఖ అంచనావేసింది. కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వేడి గాలులు వీస్తాయని వెల్లడించింది.
ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల... ఈ పరిస్థితి తలెత్తనున్నట్లు చెప్పింది. ప్రజలు వడగాలుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వాతవరణ శాఖ తెలిపింది.