ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

2016లోనే తెదేపా ఆ జీవో తెచ్చింది: సుచరిత

తితిదే నిరర్థక ఆస్తుల విక్రయ జీవోను 2016లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే తెచ్చారని హోంమంత్రి సుచరిత అన్నారు. నిరర్థక ఆస్తులను విక్రయించి ఆ సంస్థకు వినియోగించడంలో తప్పేంటని సుచరిత ప్రశ్నించారు.

home minister sucharitha on sales of ttd assets
home minister sucharitha on sales of ttd assets

By

Published : May 24, 2020, 4:17 PM IST

తితిదే నిరర్థక ఆస్తులపై హోంమంత్రి సుచరిత స్పందించారు. నిరర్థక ఆస్తులను విక్రయించి.. సంస్థకు వినియోగిండం తప్పు కాదన్నారు. అన్నింటికీ సీబీఐ విచారణ కోరుతున్నారని...వనజాక్షిపై దాడి, పుష్కరాల తొక్కిసలాట, రిషితేశ్వరి ఘటనలపై సీబీఐ విచారణ ఎందుకు చేయలేదని... హోంమంత్రి ప్రశ్నించారు. అసలు సీబీఐ రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంది ఎవరని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ పాలనకు ఏడాది నిండిన సందర్భంగా గుంటూరులో ఆమె మాట్లాడారు. ఏడాది పాలనలో ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కించారని... ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశారని గుర్తు చేశారు. కులం, మతం, పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం వచ్చాకే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగిందని... 10వేల రూపాయలలోపు ఖాతాదారులందరికీ చెల్లింపులు చేశామన్నారు. 40 శాతం మంది అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఇంకా చెల్లింపులు జరగాల్సి ఉందని హోం మంత్రి సుచరిత చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details