ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SUCHARITA: దిశ చట్టం కింద 7 రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌: హోం మంత్రి

దిశ చట్టం అమలుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత.. దాని కోసం చేస్తున్న ప్రయత్నాలను హోం మంత్రి సుచరిత మీడియాకు తెలిపారు. మహిళల భద్రతకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. దిశ చట్టంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శను తిప్పికొట్టారు.

SUCHARITA
SUCHARITA

By

Published : Aug 17, 2021, 4:54 PM IST

Updated : Aug 17, 2021, 6:59 PM IST

మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నట్లు ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. దిశ చట్టం తెచ్చాక గతంలో ఉన్న దర్యాప్తు వ్యవధిని గణనీయంగా తగ్గించామని.. ప్రస్తుతం కేవలం 42 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నామన్నారు. ఏడు రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దిశ చట్టం తీసుకొచ్చాక 2వేలకు పైగా కేసుల్లో ఏడు రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశామన్నారు. ఈ చట్టం కింద ఇప్పటివరకు 180 మంది దోషులకు శిక్ష విధించగా.. వారిలో ముగ్గురికి ఉరిశిక్ష పడిందన్నారు. దిశ యాప్‌ను మహిళలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. దిశ చట్టం కింద తీసుకున్న చర్యల వల్ల ఐదు జాతీయ స్థాయి అవార్డులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని.. 2.11 లక్షల మంది నేరస్థుల వివరాలను జియో ట్యాగ్‌ చేసినట్లు స్పష్టం చేశారు. పలు రాష్ట్రాలు దిశ చట్టం అమలుకు యత్నిస్తున్నాయని.. మహిళల భద్రత కోసం తెచ్చిన దిశ యాప్‌ను 38 లక్షల మంది డౌన్‌లౌడ్‌ చేసుకున్నారని వెల్లడించారు.

రాష్ట్రంలో మహిళల భద్రతకు సీఎం జగన్ పెద్దపీట వేశారని సుచరిత తెలిపారు. రాష్ట్రంలో దిశ చట్టం ఎక్కడుందని ప్రతిపక్షనేతలు ప్రశ్నించడం సరికాదన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. సామాజిక మాధ్యమాలపై పిల్లల ప్రభావం ఏమేరకు ఉందనే విషయాన్ని తల్లిదండ్రులు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకే వినియోగించుకోవాలన్నారు. గుంటూరులో బీటెక్‌ యువతి రమ్య హత్యకేసులో ఏడు రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలుకు ప్రయత్నిస్తామని మంత్రి వెల్లడించారు.

Last Updated : Aug 17, 2021, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details