ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీమెన్స్ ఎండీ బెయిల్​పై తీర్పు వాయిదా - high court

సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ డి. రమేశ్‌ ప్రకటించారు.

సీమెన్స్ ఎండీ బెయిల్​పై తీర్పు వాయిదా
సీమెన్స్ ఎండీ బెయిల్​పై తీర్పు వాయిదా సీమెన్స్ ఎండీ బెయిల్​పై తీర్పు వాయిదా

By

Published : Jan 5, 2022, 6:02 AM IST

సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్ వేర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సామ్యాద్రి శేఖర్ బోస్ దాఖలు చేసిన వ్యాజ్యంలో మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టు వ్యవహారంలో రూ.241కోట్లు నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణపై సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టు అయిన శేఖర్ బోస్ బెయిల్ కోసం హై కోర్టును ఆశ్రయించారు.

ABOUT THE AUTHOR

...view details