ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉద్దానం' సమస్య పరిష్కార చర్యల్ని తెలపండి: హైకోర్టు - శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వార్తలు

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో.. కిడ్నీ వ్యాధి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సొంతగా ఆలోచించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. తాగునీటి సరఫరా తదితర వివరాలను న్యాయస్థానం ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది.

High Court directed the government to take action on problem of kidney disease in uddanam at srikakulam
'ఉద్దానం' సమస్య పరిష్కార చర్యల్ని తెలపండి: హైకోర్టు
author img

By

Published : Feb 19, 2021, 7:39 AM IST

ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సొంతగా ఆలోచించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సమస్య శాశ్వత పరిష్కారానికి అనుసరిస్తున్న విధానం ఏమిటి ..? తాగు నీటి సరఫరాకు కేటాయించిన రూ.700 కోట్లు ఏ మేరకు ఖర్చు చేశారు.. తదితర వివరాల్ని కోర్టు ముందుంచాలని ఆదేశించింది. విచారణను మార్చి 4కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్​కుమార్​తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారని.. న్యాయవాది కె.సింహాచలం 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ న్యాయవాది(జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ.. 'ప్రభుత్వం తాగునీటి సరఫరాకు రూ.700 కోట్లు కేటాయించింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు గడువు కావాలి' అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details