ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC On Pension: దివ్యాంగుడి పెన్షన్ నిలిపివేతపై హైకోర్టు ఆగ్రహం.. బకాయిలు చెల్లించాలని ఆదేశం - దివ్యాంగుడి పెన్షన్ నిలిపివేతపై హైకోర్టు ఆగ్రహం వార్తలు

దివ్యాంగుల పింఛన్‌ నిలిపివేశారన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పింఛన్‌ నిలిపివేసే నాటికి పిటిషనర్​కు రేషన్‌కార్డు లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించగా..హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పింఛన్‌ కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దివ్యాంగుడి పెన్షన్ నిలిపివేతపై హైకోర్టు ఆగ్రహం
దివ్యాంగుడి పెన్షన్ నిలిపివేతపై హైకోర్టు ఆగ్రహం

By

Published : Aug 18, 2021, 3:29 PM IST

ఈ ఏడాది జనవరి నుంచి దివ్యాంగుల పెన్షన్​ను నిలిపివేశారని అడబాల రాము అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పెన్షన్ నిలిపివేసే నాటికి అతనికి రేషన్ కార్డు లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వ న్యాయవాది వివరించగా.. హైకోర్టు ఈ వాదననను తోసిపుచ్చింది. గ్రామ వాలంటీర్ సిఫార్సుతో దివ్యాంగుడి పింఛన్ నిలిపేయటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

దివ్యాంగుడి పెన్షన్​ను కొనసాగించాలని.., నిలిపివేసిన నాటి నుంచి బకాయిలను చెల్లించాలని జస్టిస్ దేవానంద్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసలు వాలంటీర్​కు ఉన్న చట్టబద్దత ఏంటో తెలిపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details