గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మే 3న 25.5 శాతం ఉన్న పాజిటీవిటి రేటు, ప్రస్తుతం 17.29 శాతంగా ఉందని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు కారణంగా కరోనా కేసుల నమోదు తగ్గుతోంది సింఘాల్ తెలిపారు.
కొత్త కేసుల నమోదులో తగ్గుదల...
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 808 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని... బ్లాక్‌ఫంగస్ వైద్యానికి అవవసరమైన ఇంజక్షన్లు, మాత్రలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు అనిల్ సింఘాల్ వెల్లడించారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున ఆక్సిజన్ వినియోగంలోనూ కొంత తగ్గుదల కనిపిస్తోందన్నారు. రోజుకు లక్ష మందికి టీకా వేసే సామర్థ్యం ఉందన్న సింఘాల్... కేంద్రం కేటాయించే టీకాల లభ్యత మేరకు ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్ చేపడతామని ప్రకటించారు. కరోనా టీకాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.