వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆ శాఖ కమిషనర్ భాస్కర్ స్పష్టం చేశారు. డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ-ఔషధి వెబ్‌సైట్‌లో ఎక్కడా సమస్యలు లేవన్న కమిషనర్...ఆస్పత్రుల్లో ఔషధాల కొరత లేదన్నారు. కొవిడ్ వల్ల ఔషధాలు కొనుగోలు ఐదారు రెట్లు పెరిగిందన్నారు. అవసరాలకు అనుగుణంగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
క్యాన్సర్ చికిత్స ఔషధాలు అవసరం కంటే ఎక్కువే ఉన్నాయని కమిషనర్ భాస్కర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయని..,మొత్తం డెంగ్యూ కేసుల్లో సగం విశాఖ జిల్లాలోనే గుర్తించామన్నారు. డెంగ్యూ జ్వరాలకు సరిపడినన్ని ఔషధాలు, టెస్ట్ కిట్లు ఉన్నాయన్నారు.