ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ధాన్యం బకాయిలు చెల్లించాలని.. కౌలు రైతు సంఘం సభ్యుల ధర్నా - ధాన్యం బకాయిలు చెల్లించాలని ధర్నా

నివర్​ తుపాన్​ కారణంగా తడిసి రంగ మారిన ధాన్యానికి నాలుగు నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం దారుణమని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

Grain arrears to be paid .. Lease farmer association members dharna
ధాన్యం బకాయిలు చెల్లించాలని.. కౌలు రైతు సంఘం సభ్యులు ధర్నా

By

Published : Mar 5, 2021, 10:16 AM IST

గతంలో వచ్చిన నివర్ తుపాన్​కు తడిసి రంగు మారిన ధాన్యానికి నాలుగు నెలలు దాటిన ఇంతవరకు ఒక్కరూపాయి కూడా చెల్లించకపోవడం దారుణమని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య అన్నారు. విజయవాడలో సంఘ నాయకులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సంఘ నాయకులు ఎం.సూర్య నారాయణ, ఎం.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details