గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు, బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14 ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల పీడీ ఖాతాల నుంచి నేరుగా విద్యుత్ శాఖ ఖాతాకు మళ్లించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. గ్రామ పంచాయతీలకు చెందిన 68,106 విద్యుత్ సర్వీసులకు గానూ రూ.1471.11 కోట్ల మేర విద్యుత్ బకాయిలున్నట్టు ప్రభుత్వం పేర్కొంది . వీటిని 14 వ ఆర్థిక సంఘం నిదుల నుంచి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
14వ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు - govt new orders
గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిల చెల్లింపునకు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1471.11 కోట్ల మేర విద్యుత్ బకాయిలున్నట్టు ప్రభుత్వం పేర్కొంది
గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలపై ప్రభుత్వం కీలక నిర్ణయం