విద్యా నియంత్రణ చట్టాన్ని నోటిఫై చేస్తూ ఉత్తర్వులు
పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్టం 2019ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నేటినుంచి నియమ నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపింది.
పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్టం-2019ని నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి చట్టంలోని నియమ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాఠశాలల్లో ఇష్టానుసారంగా పెరిగిపోయిన ఫీజుల నియంత్రణ, సౌకర్యాల లేమి తదితర అంశాలపై చట్టాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. అసెంబ్లీలో దీన్ని ఆమోదించిన అనంతరం ఈ చట్టాన్ని నోటిఫై చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 19వ తేదీ నుంచి ఈ చట్టంలోని నిబంధనలు అమల్లోకి వస్తాయని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.