అగ్రిగోల్డ్ బాధితులకు కొత్త ప్రభుత్వంలో న్యాయం జరిగేలా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా 1150 కోట్ల రూపాయలను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు 250 కోట్లు విడుదల చేస్తున్నట్లు కంటితుడుపు చర్యగా జీవో జారీ చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపు, విడుదల నిమిత్తం త్వరలోనే కమిటీ ఏర్పాటు అవుతుందని చెప్పారు.
'అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది' - govt helps agri gold
మేనిఫెస్టోలో పేర్కోన్న విధంగా అగ్రిగోల్డ్ బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వ పరంగా కమిటీని నియమించనున్నట్లు పేర్కొన్నారు.
వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి