తమ సమస్యలను పరిష్కరించాని ప్రభుత్వ వైద్యుల సంఘం వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డిని కలిసింది. సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యుల సంఘం రాష్ట్ర కన్వీనర్ డా.జయధీర్ అన్నారు.
'సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ' - జవహార్ రెడ్డి వార్తలు
తమ సమస్యల పరిష్కారాానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జయధీర్ తెలిపారు.
కరోనా చికిత్స అందిస్తూ.. వైరస్ సోకి మరణించిన వైద్యుల కుటుంబాలకు ఇవ్వాల్సిన 50 లక్షల రూపాయలు కేంద్రం నుంచి ఇంకా రాలేదన్నారు. అయితే రాష్ట్రప్రభుత్వమే త్వరలోనే 50 లక్షల రూపాయలను అడ్వాన్స్ గా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
మరణించిన వైద్యుల కుటుంబంలో ఒకరికి గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపిందన్నారు. వైద్యులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే వైద్య సేవలు అందించేందుకు జిల్లా నోడల్ అధికారిని ప్రభుత్వం నియమించేందుకు అంగీకరించిందన్నారు. పది రోజుల్లో పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటామని...ఇన్సెంటివ్స్ లపై ఆర్ధిక శాఖతో చర్చించి నిర్ణయిస్తామని ప్రభుత్వం తెలిపిందన్నారు.
ఇవీ చదవండి:కరోనా స్వైరవిహారం.. బెంబేలెత్తిస్తున్న పాజిటివిటీ