భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరవై మంది సైనికులు మృతిచెందడం పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీర మరణం పొందిన వారిలో తెలుగు వారైన తెలంగాణ సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ ఉండగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కల్నల్ సంతోష్ కుటుంబానికి గవర్నర్ ప్రగాఢ సానుభూతి - భారత్ చైనా బోర్డర్ తాజా వార్తలు
భారత దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించే ప్రయత్నంలో అమరులైన జవాన్ల సేవలు వృథా పోవని గవర్నర్ బిస్వ భూషణ్ స్పష్టం చేశారు. భారత్-చైనా బలగాల మధ్య జరిగిన వీర మరణం పొందిన తెలంగాణ సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంలో సంతోష్ మరణించారు. సంతోష్ ఆంధ్రప్రదేశ్‌లోని సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. సంతోష్ మరణవార్త తనను ఎంతో కలిచి వేసిందన్న గవర్నర్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారత దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించే ప్రయత్నంలో అమరులైన జవాన్ల సేవలు వృథా పోవని బిస్వ భూషణ్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.