ఏపీ - అమూల్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1372 కోట్లను వెచ్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డెయిరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో భాగంగా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రూ.1089 కోట్లను రుణంగా తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర వాటాగా రూ.272 కోట్లను వెచ్చించనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో పాల సేకరణ, నిల్వ కోసం బల్క్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఏఎంసీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఈ నిధులు వ్యయం చేయనున్నారు. రాష్ట్రంలో పాల సేకరణ, మార్కెటింగ్ కోసం గుజరాత్‌కు చెందిన ఆనంద్ పాల సహకార సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 200 లక్షల లీటర్ల పాలను సేకరించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తొలిదశలో ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో పాల సేకరణను ఆముల్ మొదలు పెట్టింది.