విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెదేపా నేత, గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ పేర్కొన్నారు. ప్రజలతో చర్చించకుండా, కర్మాగారం ఏర్పాటులో ప్రజల త్యాగాలను గుర్తించకుండా, వేల మంది ఉద్యోగుల భవితవ్యంపై ఆలోచన చేయకుండా ముందుకు సాగటం తగదన్నారు. గతంలో లాభాల బాట పట్టిన కర్మాగారం విస్తరణ కారణంగా అప్పు చేయాల్సి వచ్చిందని.. ఆ సమయంలో స్టీలురంగం కుదేలవడం, ధరలు గిట్టుబాటు కాకపోవడంతో నష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. 2020 నాటికి కొంత లాభాల బాట పట్టినప్పటికీ ప్రైవేటీకరణ నిర్ణయం సబబుకాదన్నారు. ఎన్నో ఏళ్లుగా సొంత గనులు కేటాయించాలని కోరుతున్నా ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఉక్కును ప్రైవేటుపరం చేస్తామంటే ఉపేక్షించబోమన్నారు.
గనులు కేటాయించకుండా ఎందుకు ఉపేక్షించారు? : శ్రీభరత్
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలనుకోవటం తగదని.. తెదేపా నేత, గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ అన్నారు. ఎవరితోనూ సంప్రదింపులు చేయకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం సరికాదని విమర్శించారు.
గనులు కేటాయించకుండా ఎందుకు ఉపేక్షించారు? : శ్రీభరత్