మహాత్మాగాంధీ జీవితం విశ్వ మానవాళికి స్ఫూర్తిదాయకమని తెదేపా నేత మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. విజయవాడలోని అమరావతి కల్చరల్ సెంటర్ లో.... ప్రపంచ దేశాల్లో గాంధీ విగ్రహాలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం కల్చరల్ సెంటర్ సీఈవో, యంగ్ ఇండియా ప్రతినిధులతో కలిసి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమని....విదేశాల్లోనూ గాంధీ ఆశయాలను విశ్వసించటంతో పాటు ఆయన సిద్ధాంతాలను పాటిస్తారని తెలిపారు.
ప్రపంచ దేశాల్లో మహాత్ముని విగ్రహాలపై... ఛాయాచిత్ర ప్రదర్శన - gandhi_photo_exhibition
ప్రపంచ దేశాల్లో మహాత్ముని విగ్రహాలపై ఛాయాచిత్ర ప్రదర్శనను విజయవాడ అమరావతి కల్చరల్ సెంటర్లో మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభించారు.
ప్రపంచ దేశాల్లో మహాత్ముని విగ్రహాలపై... విజయవాడలో ఛాయాచిత్ర ప్రదర్శన