Friendship Special Story : తోటి విద్యార్థులకు నమస్తే పెడుతూ.. చేతి ఊపి హాయ్ చెబుతున్న ఈ పిల్లాడి పేరు మధు కుమార్. సంగారెడ్డి జిల్లా కంకోల్ ఇతని సొంతూరు. చాలా చక్కగా నవ్వుతూ కూర్చొని డ్యాన్స్ కూడా చేస్తున్నాడు కదా. అయితే ఇందులో విశేషమేముందని మీకు అనుమానం రావొచ్చు. వాస్తవానికి ఆ కాళ్లు, చేతులు మధువి కావు. గణేష్ అనే ఒక విద్యార్థి ఇలా మధు కుమార్‌ని ఒడిలో కూర్చో బెట్టుకుని.. అతడికి కాళ్లు, చేతులుగా మారాడు. మధుకు కాళ్లు, చేతులు లేవనే విషయం కొత్తవాళ్లకు తెలియనంత స్థాయిలో వీళ్లు ఇలా మ్యాజిక్ చేశారు.
Friends Help Disabled Boy : మధు ఐదో తరగతిలో ఉండగా విద్యుదాఘాతానికి గురై.. కాళ్లు, చేతులు కోల్పోయాడు. చాలా రోజులపాటు ఆస్పత్రిలో మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత కోలుకున్నా.. కరోనా ప్రభావం వల్ల బడికి వెళ్లలేదు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో బడులు నడుస్తుండటంతో రోజూ పాఠశాలకు వెళ్తున్నాడు. ఇటీవల అశోక్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లలను ఆటలు ఆడించారు. అంతా అందులో నిమగ్నమయ్యారు.