ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా 4వ రోజు 18,917 మందికి వ్యాక్సినేషన్ - రాష్ట్రవ్యాప్తంగా 4వ రోజు 18,917 మందికి వ్యాక్సినేషన్

రాష్ట్రవ్యాప్తంగా 4వ రోజు కొవిడ్‌ టీకా ప్రక్రియ కొనసాగింది. మొత్తం 362 కేంద్రాల్లో 18,917 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

fourth day vaccination ap
రాష్ట్రవ్యాప్తంగా 4వ రోజు 18,917 మందికి వ్యాక్సినేషన్

By

Published : Jan 19, 2021, 10:57 PM IST

రాష్ట్రవ్యాప్తంగా 4వ రోజు కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 362 కేంద్రాల్లో 18,917 మందికి వ్యాక్సినేషన్ నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2929 మంది వ్యాక్సిన్ తీసుకోగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 191 వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు.

టీకా పంపిణీ ప్రక్రియలో ప్రకాశం జిల్లాలో ఒకరు స్వల్ప అస్వస్థతకు గురి కాగా... వైద్యులు పర్యవేక్షించినట్లు అధికారులు వివరించారు. గత మూడు రోజుల కంటే ఇవాళ వ్యాక్సినేషన్​కు అధికంగా మంది సిబ్బంది హాజరైనట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా 6.31 లక్షల మందికి కరోనా టీకా

ABOUT THE AUTHOR

...view details