రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నదులు ఉగ్ర రూపం దాలుస్తున్నాయి. కృష్ణానదిలోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరద ఉద్ధృతితో.. ప్రకాశం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 7,20,701 క్యూసెక్కులుగా ఉంది. వరద నీరు భారీగా వస్తుండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తులశాఖ కమిషనర్ సూచించారు.
ప్రకాశం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు - ప్రకాశం బ్యారేజి రెండో ప్రమాద హెచ్చరిక వార్తలు
కృష్ణా నదిలోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరద ప్రవాహం దృష్ట్యా విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రకాశం బ్యారేజి