కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లో 6,73,283 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 6,67,842 క్యూసెక్కులుగా ఉంది. కాలువలకు 5,441 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
ఉద్ధృతంగా కృష్ణమ్మ... ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక - కృష్ణా నదికి వరద
కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కరకట్ట వద్ద ఉన్న చిగురు బాలల ఆశ్రమానికి వరద పోటెత్తింది. ఆశ్రమంలోని 72 మంది బాలలను విజయవాడలోని గుణదలకు తరలించారు.
ఉద్ధృతంగా కృష్ణమ్మ
కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. కరకట్ట వద్ద ఉన్న చిగురు బాలల ఆశ్రమానికి వరద పోటెత్తింది. ఆశ్రమంలోని 72 మంది బాలలను విజయవాడలోని గుణదలకు తరలించారు. మహానాడులోని లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని ప్రజలకు అధికారులు సూచనలు చేశారు.
ఇదీ చదవండి: ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం