ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఆసిఫాబాద్ తిర్యాని అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు - తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల కదలికలు

తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల కదలికలు అలజడి రేపుతున్నాయి. ఆసిఫాబాద్ తిర్యానీ అటవీ ప్రాంతంలో తెల్లవారుుజామున పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఆసిఫాబాద్ తిర్యాని అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు
ఆసిఫాబాద్ తిర్యాని అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు

By

Published : Jul 15, 2020, 11:51 AM IST

తెలంగాణలోని ఆసిఫాబాద్ తిర్యానీ అటవీ ప్రాంతంలో తెల్లవారు జామున పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ కోసం కూంబింగ్ చేస్తుండగా తెల్లవారుుజామున మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు.

రెండ్రోజుల కిత్రం కూంబింగ్‌లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ తప్పించుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రెండురోజులుగా కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మరోసారి మావోయిస్టులు తారసపడటంతో ఈ కాల్పులు జరిగాయి. తప్పించుకున్న వారిలో ఎవరెవరు ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

ABOUT THE AUTHOR

...view details