విజయవాడ శివారులోని ప్రసాదం పాడు జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విజయవాడ వస్తున్న బస్సు ప్రసాదంపాడు సమీపంలో బస్సు వెనక టైర్లు కొట్టుకుపోవటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్... ప్రయాణికులను దించేయడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఆటోనగర్ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అవడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం..తప్పిన ముప్పు - vijayawada latest news
విజయవాడ శివారులో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం..తప్పిన ముప్పు