ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 29, 2020, 1:15 PM IST

ETV Bharat / city

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విజయవాడ పోరంకి సెంటర్​లో వామపక్షాల ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ చట్టాలను రైతాంగానికి ఉరితాడుగా అభివర్ణించారు.

farmers protest in vijayawada
వామపక్షాల ఆధ్వర్యంలో రైతుల నిరసన

రైతాంగానికి ఉరితాడుగా మారిన కేంద్రం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ... వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడ పోరంకి సెంటర్​లో పెద్దఎత్తున రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి ప్రక్కన టెంట్ వేసి ప్రశాంతంగా దీక్షలు చేస్తున్న రైతులపై.. స్థానిక సీఐ సత్యనారాయణ, ఎస్​ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు పలువురిని అరెస్ట్​ చేశారు.

రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేస్తుంటే పోలీసులు అడ్డుకోవటం రైతాంగం పట్ల పాలకుల నిరంకుశ వైఖరి తేటతెల్లమౌతుందని సీపీఎం జిల్లా నాయకులు మాగంటి హరికృష్ణ, పంచకర్ల రంగారావు, సీపీఐ నాయకులు మున్నంగి నరసింహారావు, ఉప్పాడ త్రిమూర్తులు తీవ్రంగా ఖండించారు.

ఇదీ చదవండి:తందూరి చాయ్...తాగితే వదలరోయ్.!

ABOUT THE AUTHOR

...view details