ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం చేస్తాం' - Farmer and labor unions latest news

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు, కార్మిక సంఘాలు డిమాండ్​ చేశాయి. నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేవరకు ఐక్య పోరాటం చేస్తామని విజయవాడలో జరిగిన సమావేశంలో సంఘాల నాయకులు అన్నారు.

Farmer and labor unions
రైతు, కార్మిక సంఘాలు

By

Published : Jun 21, 2021, 4:43 PM IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం బాధాకరమని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. విజయవాడలో జరిగిన రైతు, కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ఏడు నెలలుగా రైతులు ఉద్యమిస్తున్నా కేంద్రం కనీసం పట్టించుకోవట్లేదని ఆవేదవ వ్యక్తం చేశారు.

మూడు నల్ల చట్టాల రద్దు, రైతు రుణ ఉపశమన చట్టం చేయాలని, విద్యుత్ 2020 సంస్కరణల బిల్లు వెనక్కి తీసుకోవాలని కోరుతూ జూన్ 26వ తేదీన రాజ్​భవన్​లో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో విజ్ఞాపన పత్రాలు ఇచ్చి విజయవాడ ధర్నా చౌక్​లో రైతు, కార్మిక సంఘాలతో నిరసన చేపడతామన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఐక్య పోరాటం చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:'ప్రభుత్వ శాఖల్లో పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

ABOUT THE AUTHOR

...view details