ఎస్సీ నేత ఆనందబాబుకు నోటీసు ఇవ్వటం పోలీసుల బెదిరింపు చర్యేనని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. బెదిరింపులతో ఎస్సీ నాయకత్వాన్ని కట్టడి చేయలేరని తెలిపారు. అంబేద్కర్ వారసులుగా అక్రమాలను దౌర్జన్యాలను ఎండగడతామని స్పష్టం చేసారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోపణలు చేసినవారిని ఆధారాలు అడగడం పోలీస్ వ్యవస్థ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. పోలీస్, దొంగలు ఒక్కటయ్యారని ఆరోపించారు. రాష్ట్రం మాదక ద్రవ్యాల అడ్డాగా మారిందన్నారు. పాలకులే అక్రమార్జనకు కేరాప్ అడ్రస్ గా మారారని విమర్శించారు. నాటు సారా ఏరులై పారుతుందన్న అయన ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయన్నారు. గంజాయి అని గూగుల్లో వెతికితే రాష్ట్రం పేరు కనపడుతుందని ఎద్దేవా చేశారు. సార రహిత జిల్లాలను నాటు సారా జిల్లాలుగా మార్చారని చెప్పారు. ఏపీని మాదక ద్రవ్య రాజధాని చేశారని ధ్వజమెత్తారు.
ఆనంద్ బాబుకు నోటీసులివ్వడం బెదిరింపు చర్యే: జవహర్
ఎస్సీ నేత ఆనంద్ బాబుకు నోటీసులివ్వడం బెదిరింపు చర్యేనని మాజీమంత్రి జవహర్ అన్నారు. బెదిరింపులతో ఎస్సీ నాయకత్వాన్ని కట్టడి చేయలేరని చెప్పారు.
ex minister javahar fire on giving notice to nakka anandbabu