ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అచ్చెన్నాయుడిని జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు' - అచ్చెన్నాయుడి అరెస్ట్​పై అమర్నాథ్​రెడ్డి కామెంట్స్

అచ్చెన్నాయుడిని జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలనే తపన... ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. తెదేపా నేతలు స్వచ్ఛందంగా అరెస్టులకు సిద్ధమైతే... ఉన్న జైళ్లు సరిపోవని వ్యాఖ్యానించారు.

ex minister amarnath reddy about atchannaidu
ex minister amarnath reddy about atchannaidu

By

Published : Jun 25, 2020, 5:25 PM IST

మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడి విషయంలో ప్రభుత్వం కక్షసాధింపు వైఖరి అర్థమవుతోందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఆయనను ఆసుపత్రిలోనే విచారణ చేయాలని న్యాయస్థానం ఆదేశించినా... అర్ధరాత్రి డిశ్చార్జ్​ పేరుతో హైడ్రామాచేయడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు.

ఇలానే వ్యవహరిస్తే.. తగిన మూల్యం చెల్లించుకుంటారని అమర్నాథ్​రెడ్డి హెచ్చరించారు. తెదేపా నాయకులంతా స్వచ్ఛందంగా అరెస్టులకు సిద్ధమైతే ఉన్న జైళ్లు సరిపోవన్నారు. వైకాపా ప్రభుత్వానికి పోలీసులు, డాక్టర్లు వత్తాసు పలకడమేంటని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details