ఇదీ చదవండి:
e-kyc must: రేషన్ కావాలంటే.. ఈ-కేవైసీ చేయించుకోవాల్సిందే..! - ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కోన శశిధర్‌తో ముఖాముఖి
రాష్ట్రంలో రేషన్ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులంతా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. లేదంటే రాబోయే రోజుల్లో వారికి రేషన్ బియ్యం, ఇతర నిత్యావసరాలు పొందే వీలుండబోదనే ప్రచారం జోరందుకుంది. ఒక రేషన్ కార్డులో నలుగురు కుటుంబ సభ్యులుంటే.. ఎంతమంది ఈ కేవైసీ చేయించుకుంటే వారికే బియ్యం అందుతాయని పౌరసరఫరాలశాఖ పేర్కొంటోంది. పెద్దలకు ఆగస్టు నెలాఖరులోగా, పిల్లలకైతే సెప్టెంబరు నెలాఖరులోగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి కావాలని పౌర సరఫరాలశాఖ గడువు విధించడంతో- తెల్లవారుజాము నుంచి ప్రజలు ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. వేలి ముద్ర కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు. తాజా పరిణామాలపై పౌరసరఫరాలశాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కోన శశిధర్‌తో ఈటీవీ ముఖాముఖి.
ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కోన శశిధర్