ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ED Raids: శ్రీకృష్ణ జువెల్లరీస్ సంస్థపై ఈడీ దృష్టి... ఏకకాలంలో దాడులు - Enforcement directorate raids on jewelry shop

మనీలాండరింగ్​కు పాల్పడ్డారనే ఆరోపణలపై హైదరాబాద్​లోని శ్రీకృష్ణ జువెల్లరీస్ సంస్థపై ఈడీ దృష్టి సారించింది. బంజారాహిల్స్​లోని ప్రధాన కార్యాలయం శ్రీకృష్ణా హౌస్​తో పాటు అబిడ్స్ తదితర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం ఆరు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ఏకకాలంలో నగరంలోని అన్ని దుకాణాలు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు.

శ్రీకృష్ణ జువెల్లరీస్  సంస్థపై ఈడీ దృష్టి
శ్రీకృష్ణ జువెల్లరీస్ సంస్థపై ఈడీ దృష్టి

By

Published : Oct 7, 2021, 10:15 PM IST

శ్రీకృష్ణ జువెల్లరీస్ సంస్థపై ఈడీ దృష్టి

విదేశాల నుంచి బంగారం ఎగుమతుల పేరిట మనీలాండరింగ్​కు పాల్పడ్డారనే ఆరోపణలపై హైదరాబాద్​లోని శ్రీకృష్ణ జువెల్లరీస్ సంస్థపై ఈడీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఏకకాలంలో హైదరాబాద్​లోని శ్రీకృష్ణ జువెల్లరీస్ కార్యాలయాలు, దుకాణాల్లో సోదాలు నిర్వహిస్తోంది. 2019లో డీఆర్‌ఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ కీలక సమాచారం సేకరించి ఆరు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తోంది. బంజారాహిల్స్​లోని ప్రధాన కార్యాలయం శ్రీకృష్ణా హౌస్​తో పాటు అబిడ్స్ తదితర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని శ్రీకృష్ణ జువెల్లరీస్​కి చెందిన సెజ్ యూనిట్​లో నింబంధనలు అతిక్రమించి బంగారాన్ని ఎగుమతికి బదులు స్థానిక షాపులకు విక్రయించారని... మొత్తం 330 కోట్ల విలువ చేసే 1100 కేజీల బంగారాన్ని దారి మళ్లించారని.. 2019 మేలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సంస్థ ఎండీ ప్రదీప్ కుమార్​తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. అయితే ఈ కేసులో మనీలాండరింగ్​కు పాల్పడ్డారని ఈడీ ఆధారాలు సేకరించింది.

ఈ రోజు ఉదయం ఆరు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ఏకకాలంలో నగరంలోని అన్ని దుకాణాలు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెట్లను ఈడీ అధికారుల స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని విచారించారు. ఉదయం పది గంటలు నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మనీలాండరింగ్​కు పాల్పడ్డారని తేలితే వారిపై కేసు నమోదు చేసి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details