శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పత్తి పేరుతో నీటిని తెలంగాణ(telangana) రాష్ట్రం వాడుకుంటోందని, ఇది ఆంధ్రప్రదేశ్(andhrapradesh) ప్రయోజనాలను దెబ్బ తీస్తోందని కృష్ణా బోర్డు(krishna board) కార్యదర్శికి జల వనరులశాఖ ఇంజినీరు ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే శ్రీశైలం జలాలతో ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి చేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఒకసారి ఈ విషయాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకొచ్చినా విద్యుదుత్పత్తి కొనసాగుతూనే ఉందని ఈఎన్‌సీ గుర్తు చేశారు.
KRMB: శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వం లేఖ
శ్రీశైలం(srisailam) ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి నిలిపేసేలా చూడాలని ఏపీ ప్రభుత్వం.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB)ను కోరింది. బోర్డు అనుమతి లేకుండానే నీటిని వినియోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ ఈ తరహాలో వ్యవహరిస్తే పోతిరెడ్డిపాడు(pothireddypadu) నుంచి నీళ్లు తీసుకోలేమని స్పష్టం చేశారు.
ENC letter to krishna board
లేఖలో ఏముందంటే..
- జూన్ ఒకటితో ప్రారంభమైన కొత్త నీటి సంవత్సరంలో ఇంతవరకూ శ్రీశైలం జలాశయంలోకి 8.98 టీఎంసీల నీటి ప్రవాహాలే వచ్చాయి. అందులో 3.09 టీఎంసీలను విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ వినియోగించుకుంది. మొత్తం నీటి ప్రవాహాల్లో ఇది 34 శాతం.
- నాగార్జున సాగర్(nagarjuna sagar) జలాశయంలో ఖరీఫ్ అవసరాలకు తగ్గ నీళ్లున్నాయి. వెంటనే వ్యవసాయ అవసరాలకు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని మళ్లించాల్సిన పరిస్థితులు ఏమీ లేవు. సాగర్ జలాశయం కింద, కృష్ణా డెల్టాలోనూ వ్యవసాయ అవసరాలకు నీరు వినియోగించుకునే క్రమంలోనే విద్యుదుత్పత్తి చేపట్టాలి.
- ఇలా విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడుకుంటూ పోతే శ్రీశైలం జలాశయంలో నీటిమట్టాలు పడిపోతాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోవాలంటే శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం ఉండాలి. అప్పుడూ 7000 క్యూసెక్కులే తీసుకోగలం.
- పోతిరెడ్డిపాడు ద్వారా చెన్నైకి నీటి సరఫరా, తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కాలువ, గాలేరు-నగరి సుజల స్రవంతికి నీళ్లు సరఫరా చేయడం ఆలస్యమవుతుంది. జూన్ ఒకటిన శ్రీశైలం నీటిమట్టం 808.40 అడుగులు ఉంది. ఎండీడీఎల్ +834 కన్నా ఇది తక్కువే.
- వరదల సమయంలో తప్ప శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి జలాశయాల నుంచి కృష్ణా బోర్డు అనుమతి లేకుండా నీటిని తీసుకోవడానికి వీలు లేదు. తెలంగాణ విద్యుదుత్పత్తికి ఎలాంటి అనుమతులు లేవు.
ఇదీ చదవండి:Exams Cancelled: పది, ఇంటర్ పరీక్షలు రద్దు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం