ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విధిలేక ఒప్పుకున్నాం.. పీఆర్సీపై ఏ ఉద్యోగీ సంతృప్తిగా లేరు: సూర్య నారాయణ

పీఆర్సీపై ఉద్యోగులు ఎవరూ సంతృప్తిగా లేరని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. సూర్యనారాయణ అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పీఆర్సీని అంగీకరించాల్సి వచ్చిందన్నారు.

By

Published : Apr 20, 2022, 3:27 PM IST

సూర్య నారాయణ
సూర్య నారాయణ

రాష్ట్ర ప్రభుత్వం చేసిన 11వ వేతన సవరణపై ఏ ఒక్క ఉద్యోగి కూడా సంతృప్తిగా లేరని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యనారాయణ అన్నారు. పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్​తో చర్చ సందర్భంగా విధిలేక తప్పనిసరి పరిస్థితుల్లోనే దాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. పీఆర్సీపై ఈ రోజుకూ ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ముఖ్యమంత్రి జగన్ గతంలో హామీ ఇచ్చిన సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయటంలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని సూర్యనారాయణ అన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపించటం లేదని.., వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మధ్య ఉన్న అనైక్యతను ప్రభుత్వం ఆసరాగా చేసుకుంటోందన్న సూర్య నారాయణ.. ఒక్కటిగా సమస్యలపై పోరాటం చేయాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి: CM Jagan on nellore leaders disputes: నెల్లూరు జిల్లా వైకాపా నేతల రచ్చపై సీఎం జగన్ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details