గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గం నేడు సమావేశమైంది. విజయవాడ ఆర్టీసీ హౌస్లో ఉద్యోగులు సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు-పరిష్కారం అనే అంశంపై సమావేశంలో నేతలు చర్చించారు.
సచివాలయ సిబ్బంది సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం: వెంకట్రామిరెడ్డి
విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు-పరిష్కారం అనే అంశంపై సమావేశంలో నేతలు చర్చించారు.
గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎదుర్కొంటోన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని సచివాలయ ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు. అక్టోబర్ నుంచి ప్రొబెషన్ డిక్లేర్ చేయాలని కోరగా దానికి ముఖ్యమంత్రి అంగీకరించారని వెల్లడించారు. డిపార్టుమెంట్ పరీక్ష పాసైన వారందరికి సర్వీసులు రెగ్యులర్ అవుతాయని తెలిపారు. 1.34 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను .. నిబంధనల ప్రకారం సర్వీసులను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందని వెల్లడించారు. కొత్త వ్యవస్థ వచ్చినపుడు కొన్ని సమస్యలు తలెత్తుతాయని వాటన్నంటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఇదీ చదవండి