'ఈనాడు' ఆధ్వర్యంలో.. పాపాయి ఆరోగ్యమస్తు - pampers for kids
చిన్నారులకు పాంపర్స్ వాడకంపై.. ఈనాడు వసుంధర ఆధ్వర్యంలో విజయవాడలో అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈనాడు వసుంధర కుటుంబం, పాంపర్స్ సంయుక్త ఆధ్వర్యంలో "పాపాయి ఆరోగ్యమస్తు" కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు, పాలిచ్చే తల్లుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై విజయవాడలోని వేదిక కల్యాణ మండపంలో అవగాహన కల్పించారు. స్త్రీలు గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవం వరకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, బిడ్డ పుట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు వహించాలన్న విషయాలను వైద్యులు వివరించారు. బిడ్డకు తల్లిపాలు ఎంత అవసరమో తెలియజేశారు. పిల్లలకు రాత్రి వేళల్లో నిద్రాభంగం కలగకుండా నాణ్యమైన డైపర్స్ వాడాలని సూచించారు. పాంపర్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ సంస్థ ప్రతినిధులు డెమో చూపించారు.