ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభం

పోలవరంలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను.. జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు. గోదావరి ప్రవాహం తగ్గడంతో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించారు. భారీ యంత్రాల సాయంతో.. వైబ్రో కాంప్యాక్షన్, శాండ్ ఫిల్లింగ్ చేపట్టారు.

earth cum rock fill dam works started in polavaram
పోలవరంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల ప్రారంభం

By

Published : Dec 23, 2020, 5:44 PM IST

పోలవరంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభమయ్యాయి. గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులను జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు. భారీ యంత్రాల సాయంతో వైబ్రో కాంప్యాక్షన్, శాండ్ ఫిల్లింగ్ పనుల్ని కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ మొదలుపెట్టింది.

ఇసుక పటుత్వ పరీక్షలు

ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మించే ప్రదేశం వద్ద.. భారీ యంత్రాల సాయంతో 10 లక్షల 85 వేల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక పటుత్వ పరీక్షలను నిర్వహించారు. దాదాపు లక్షా 61 వేల మీటర్ల మేర శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కావస్తుండటంతో.. ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు మొదలు పెట్టినట్టు వారు తెలిపారు.

54 మీటర్ల ఎత్తుతో.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్​ నిర్మాణం

54 మీటర్ల ఎత్తుతో.. నదీ ప్రవాహం మధ్యలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్​ను నిర్మించనున్నారు. 2.3 కిలోమీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం కానుంది. దీంతో ముందస్తుగా ఆ ప్రదేశంలో ఇసుక పటుత్వ పరీక్షలు, శాండ్ ఫిల్లింగ్ ప్రక్రియను జలవనరుల శాఖ చేపట్టింది.

ఇదీ చదవండి:

అదనపు నిధుల సమీకరణకు.. రాష్ట్రానికి కేంద్రం అనుమతి

ABOUT THE AUTHOR

...view details