విజయవాడ దుర్గ గుడిపై వస్తున్న అవినీతి, అక్రమాల ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నరహరిశెట్టి నరసింహరావు డిమాండ్ చేశారు. తక్షణమే ఈవో సురేశ్‌ను తొలగించాలన్నారు.
ఈవో కొనసాగింపు చెల్లదని.. తక్షణం ఐఏఎస్, ఐఆర్ఎస్ హోదా ఉన్న వ్యక్తిని దుర్గగుడి ఈవోగా నియమించాలని నరసింహారావు అన్నారు. భక్తుల మనోభావాలను కాపాడాలని, అమ్మవారి ఆస్తులను పరిరక్షించాలని కోరారు. లేని పక్షంలో న్యాయ వాదిగా, ఒక భక్తునిగా న్యాయ స్థానాన్ని అశ్రయిస్తానని హెచ్చరించారు.