'శరన్నవరాత్రుల సంపూర్ణ ఫలితం కోసమే.. పూర్ణాహుతి' - DURGA TEMPLE
దసరా మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. విజయవాడ దుర్గగుడిలో పూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు పలికారు. బుధవారం రాజరాజేశ్వరీ రూపంలోనే అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
'రేపు రాజరాజేశ్వరీ రూపంలోనే అమ్మవారి దర్శనం'
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ.... బుధవారమూ రాజరాజేశ్వరీ దేవీ రూపంలోనే దర్శనమిస్తారని ఆలయ ఈవో సురేశ్‌బాబు అన్నారు. అన్ని శాఖల సహకారంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయని చెప్పారు. పది రోజులపాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారికి పూర్ణాహుతి సమర్పించి ఉత్సవాలు ముగించారు. శరన్నవరాత్రుల సంపూర్ణ ఫలితం కోసమే పూర్ణాహుతి కార్యక్రమమని... పూర్ణాహుతి విశిష్టతను స్థానాచార్యులు శివప్రసాద్‌శర్మ వివరించారు.