Drunker Attack on Conistable : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు. మద్యం సేవించి ఆకతాయిలు అల్లరి సృష్టిస్తున్నారంటూ కొందరు 100 కు ఫోన్ చేయగా.. వారిని అదుపు చేసేందుకు మచిలీపట్నం పోలీసులు వెళ్లారు.
అయితే.. మద్యం మత్తులో తూగుతూ వీరంగం సృష్టిస్తున్న మద్దెల కృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కృష్ణ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మత్తులో విచక్షణ కోల్పోయిన కృష్ణ.. తీవ్ర ఆగ్రహంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ తలపై ఇటుకతో కొట్టాడు. దీంతో.. శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు.