రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థను మెరుగుపరచేందుకే ఈకేవైసీ విధానంను తెస్తున్నామని కృష్ణా,తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు ఇంతియాజ్,మురళధర్ రెడ్డి లు ప్రకటించారు.ఈకేవైసీ అప్ డేట్చేయించుకోకపోతే,రేషన్ కార్డులుతొలగిస్తారన్న పుకార్లను నమ్మొద్దని వారు సూచించారు.ఈకేవైసీ కోసంఇకపైఆధార్సెంటర్లు,మీ సేవా కేంద్రాలకువెళ్లవలసిన అవసరం కూడా లేదని వారు తెలిపారు.చదువుకునే పిల్లలకు పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాల్లో ఈకేవైసీ నమోదు చేయవచ్చని, 15ఏళ్లదాటిన వారే మాత్రమే ఆధార్ కేంద్రాలకు వెళ్ళాలనిసూచించారు.మిగిలిన వారంతా చౌక ధరల దుకాణాల వద్ద ఈకేవైసీనినమోదు చేసుకుంటే సరిపోతుందని వివరించారు.వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు పంపిణీలోఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకే ఈ విధానం అమలు చేయబోతున్నట్లు చెప్పారు.
ఈకేవైసీ విధానం రేషన్ కార్డుల తొలగింపుకోసం కాదు - west godavari collector
ఈకేవైసీ చేయించుకోనంత మాత్రాన రేషన్ కార్డు తొలగించే అవకాశం లేదని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళధర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈకేవైసీ విధానంతో రేషన్ కార్డులను తొలగించం