ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 11, 2020, 7:34 PM IST

ETV Bharat / city

పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు: జిల్లా కలెక్టర్

ఏలూరులో వింతవ్యాధి అనేక మందిని అస్వస్థతకు గురిచేసిన తరుణంలో ఇతర జిల్లాల్లోని అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఎక్కువ జనసాంద్రత- ప్రమాదకరమైన పరిస్థితులు ఉండే ప్రాంతాల వైపు దృష్టి సారిస్తున్నారు. విజయవాడ ఆటోనగర్‌లో వ్యర్థాల కారణంగా పర్యావరణం కాలుష్యమై ప్రజలు ఇబ్బందిపడకుండా ఉండేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ అహ్మద్‌ అధికారులను ఆదేశించారు.

పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు
పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు

విజయవాడ నగరపాలక సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, ఐలా తదితర శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆటోనగర్‌లో పర్యటించారు. ఆటోనగర్‌లోని వ్యర్థాలను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వారం రోజుల్లో సంబంధిత అధికారులు ఆటోనగర్‌లో సమావేశం నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేస్తారన్నారు.

ఆటోమొబైల్‌ యూనిట్లను పరిశీలించిన కలెక్టర్​...అక్కడి వ్యర్థాలను ఏ రూపంలో తరలిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాత బ్యాటరీలను ఎక్కడికి తరలిస్తున్నారు? వాటి భాగాలు ఏ విధంగా విడగొడుతున్నారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆటోనగర్‌లో పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దని సూచించారు. సీసం ఇతర అవశేషాల వల్ల తాగునీరు కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఐలా ఛైర్మన్‌ దుర్గాప్రసాద్‌కు సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details