వైకాపా పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులపై తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా మహిళ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రగల్భాలు అనంతపురం జిల్లాలో బలైపోయిన ఎస్సీ మహిళను బతికించగలవా? అని దివ్యవాణి ప్రశ్నించారు. అదే జిల్లాలో ఓ బాలికను అత్యాచారం చేసిన లారీడ్రైవర్ను ఎందుకు శిక్షించలేకపోయారని ఆమె ఆక్షేపించారు.
మహిళలపై దాడులకు పాల్పడిన వారిలో ఎంత మందిని దిశ చట్టం ప్రకారం 21రోజుల్లో శిక్షించారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి నిలదీశారు. మహిళల గౌరవానికి భంగం కలిగే ఘటనలు ఏపీలోనే అధికంగా జరిగాయన్న నివేదికలపై ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రయోజనాలు, మంత్రిపదవుల కోసం ముఖ్యమంత్రిని పొగడటం ఇకనైనా మానుకుంటే మంచిదని హితవు పలికారు.