విద్యుత్తు పంపిణీ సంస్థలు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కంలు)ఎల్‌సీ ఇస్తేనే విద్యుత్తు సరఫరా చేయాలన్న నిబంధన అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధన ఆగస్టు 1, 2019 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఉత్పత్తి కంపెనీలకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న జెన్‌కోలకు డిస్కంలు ఇప్పటికే 20 వేల కోట్ల బకాయిలు పడ్డాయి. కొత్త నిబంధన అమల్లోకి వస్తే డిస్కంలు ప్రతి రోజూ తీసుకున్న విద్యుత్తు విలువను నేరుగా బ్యాంకు నుంచి చెల్లించేలా ఏర్పాటు చేయాలి.
వాటిని నిర్ణయించే అధికారాలు రాష్ట్రానికే
బకాయిలను చెల్లించటంలో డిస్కంలు జాప్యం చేస్తే సంబంధిత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను అంగీకరించటానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయటం లేదు. ఈ మేరకు ఎల్‌సీలను ఇవ్వటం సాధ్యపడదని ఇంధనశాఖ అధికారులు లేఖ రాశారు. వారి నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలకు ఎల్‌సీల గురించి నిర్ణయించే అధికారాన్ని సంబంధిత రాష్ట్రప్రభుత్వాలకే ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
సరఫరాలో సాంకేతిక నష్టాలు