విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణమాసం సందడి మొదలైంది. తొలి శుక్రవారం కావడం వల్ల కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అంతరాలయ దర్శనాలను అధికారులు నిలిపివేశారు. దీంతో ముఖమండపం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెనుదిరిగారు. కరోనా దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అధికారులు అనుమతించారు.
శ్రావణ శుక్రవారం పరిమిత సంఖ్యలో కనకదుర్గమ్మ దర్శనాలు
శ్రావణ శుక్రవారం రోజుల విజయవాడలో అమ్మవారిని దర్శించుకునేందుకు పరిమిత సంఖ్యలో భక్తులను అధికారులు అనుమతి ఇచ్చారు. వీళ్లంతా ప్రత్యేక పూజలు చేశారు. అంతరాలయం దర్శనాలు నిలిపివేయడంతో ముఖ మండపం నుంచి దేవి దర్శించుకొని వెనుదిరిగారు.
విజయవాడలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు