వైకాపా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో నాటకాలు ఆడి పనులన్నీ నిలిపేసిందని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పోలవరంలో పునాదులు పూర్తి కాలేదని ఎన్నికల ముందు చెప్పిన జగన్.. ఇప్పుడు అదే పోలవరాన్ని ఎలా సందర్శించారని ప్రశ్నించారు. పోలవరంపై వైకాపా చెప్పినవన్నీ అబద్ధాలని ఒప్పుకుంటారా అని నిలదీశారు. పోలవరంపై తాము ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. పోలవరంలో రూ.500 కోట్లు దోచుకునేందుకు జగన్ సిద్ధమయ్యారని దేవినేని ఆరోపించారు.
'పోలవరంలో రూ.500 కోట్లు దోచుకునేందుకు రంగం సిద్ధం' - సీఎం జగన్ పోలవరం పర్యటనపై దేవినేని ఉమ వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్టులో డబ్బులు దోచుకునేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైందని.. తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. 500కోట్లు దోచుకోవడానికి సీఎం జగన్ రంగం సిద్ధం చేశారని విమర్శించారు.
దేవినేని ఉమ