పోలవరం స్టాప్‌వర్క్ ఆర్డర్ బ్యాన్ (Polavaram Stop work Order Ban) ఎత్తివేతపై ఈ ఏడాది జులై తర్వాత వైకాపా (YCP) ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) ప్రభుత్వాన్ని నిలదీశారు. తెదేపా (TDP) ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు బ్యాన్ ఎత్తివేతపై చర్యలు తీసుకుంటూ వచ్చి పనులు సజావుగా సాగేలా చూస్తే..,ఈ ఏడాది జులైతో ముగిసిన గడువుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. గోదావరికి (Godavari) 10 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తుండటంతో పోలవరం (Polavaram) ముంపు ప్రాంతాల్లో 70 గ్రామాల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ప్రభుత్వం మాత్రం మొద్ద నిద్రపోతూ వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించటంలేదని ధ్వజమెత్తారు. గిరిజనులు, ఆదివాసీలు అంటే ప్రభుత్వానికి (AP government) ఎందుకంత చులకన అని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల గుండెల్లో గునపాలు దింపి, వారిని గోదావరిలో ముంచేశారని దుయ్యబట్టారు.
పోలవరం ముంపు గ్రామాల ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాగడానికి కనీసం నీళ్లు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 70 గ్రామాల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మొద్ద నిద్రపోతూ వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించటంలేదు. గిరిజనులు, ఆదివాసీలు అంటే ప్రభుత్వానికి ఎందుకంత చులకన. పోలవరం స్టాప్‌వర్క్ ఆర్డర్ బ్యాన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి.- దేవినేని ఉమా మాజీ మంత్రి.
వైకాపా కార్యకర్తలా డీజీపీ..!