సైబర్ క్రైమ్ పోలీసులకు దేవినేని అవినాశ్ ఫిర్యాదు - నారా లోకేశ్
తమపై కొందరు.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తోపాటు తనపై... కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తెదేపాపై విషప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అవినాశ్ మాట్లాడుతూ.. తప్పుడు వార్తలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అసత్య ఆరోపణలు ప్రచారం చేసే వారిపై పరువునష్టం దావా వేసి చట్టపరమైన చర్యలు తీసుకునేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు.