'గుర్తింపు రద్దుపై వైకాపా 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి' - వైసీపీ గుర్తింపు రద్దు న్యూస్
వైకాపా గుర్తింపు రద్దు చేయాలన్న పిటిషన్‍పై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిట్ పిటిషన్ వేసింది.
వైకాపా గుర్తింపును రద్దు చేయాలన్న పిటిషన్‍పై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ పార్టీని రద్దు చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పేరు వాడకుండా చూడాలని అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది. లెటర్ హెడ్స్, పోస్టర్లు, బ్యానర్లలో ఉపయోగించే పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని.. వైకాపా, కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో పిటిషనర్ రిజాయిండర్ దాఖలు చేయాలని సూచిస్తూ... విచారణను నవంబర్ నాలుగో తేదీకి వాయిదా వేసింది.