విశాఖ నగరాన్ని పర్యాటకంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు వినోద నగరంగా మార్చే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే విశాఖ నగరం పర్యాటక పరంగా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని, మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎస్ పేర్కొన్నారు.
CS sameer sharma : 'విశాఖను అంతర్జాతీయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టి' - CS sameer sharma review meeting with officials
అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సమీక్ష నిర్వహించారు. విశాఖ నగరాన్ని పర్యాటకంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే అంశంపై చర్చించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ
భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్ కారిడార్ అభివృద్ధి చేయడంతో పాటు ఇతర ప్రాజెక్టుల అమలు పై సీఎస్ సమీక్షించారు. సముద్రంలో జెట్టీ నిర్మాణం, బీచ్ వాటర్ స్ట్రక్చర్ల నిర్మాణం, సీ ప్లేన్ లు, క్రూయిజ్ షిప్పులు, అమ్యూజ్మెంట్ పార్కు, రిటైల్ అవులెట్స్ వంటి ఏర్పాటుకు తీసుకోవాల్సిన అంశాలపై సమీర్ శర్మ అధికారులతో చర్చించారు.
ఇదీచదవండి.