మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల అమలు, పెండింగ్ అంశాలపై ఇక నుంచి ప్రతి నెలా మొదటి బుధవారం.. అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని.. సీఎస్ సమీర్‌శర్మ ఆదేశించారు. ముఖ్యమంత్రి హామీలు, ఈ-ఫైలింగ్, కోర్టు కేసులు, పదోన్నతులపై డీసీపీల ఏర్పాటు సహా పలు అంశాలపై..... అన్ని శాఖల కార్యదర్శులతో బుధవారం.. సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి హామీలపై తీసుకున్న చర్యలపై శాఖల వారీగా నివేదిక ఇవ్వాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. కరోనా కారణం మృతి చెంద్ిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు..... నవంబర్ 30 లోగా కారుణ్య నియామకాలు చేపట్టాల్సిందిగా మెమో జారీ చేశారు.
ఆర్థికేతర అంశాల అమలులో భాగంగా ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి డీసీపీల నియామకంపై చర్యలు చేపట్టాల్సిందిగా సూచనలు జారీచేశారు. ఈ-ఫైలింగ్ విధానాన్ని మరింత పటిష్ఠం చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎక్కువ నిధులు ఎలా రాబట్టుకోవాలన్న అంశంపై దృష్టి పెట్టాలని సీఎస్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీచేశారు. కోర్టు కేసుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని..... ఇందుకోసం లైజనింగ్ అధికారిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కోర్టు విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు..... రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్లో.. రెవెన్యూ శాఖలోనే ఎక్కువ శాతం పెండింగులో ఉన్నట్లు సీఎస్.. అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో 55వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నందున కేడర్‌స్థాయిని నిర్ధరించిన అంశంపైనా చర్చించారు.