ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు సీఎస్‌కు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనీ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
విజయవాడ దుర్గమ్మ సేవలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం - సీఎస్
దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం విజయవాడ దుర్గ గుడి అధికారులకు సూచించారు. ఆయన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
విజయవాడ దుర్గమ్మ సేవలో ఎల్వీ సుబ్రమణ్యం